తప్పుడు ఫలితాలకు అమ్మాయి బలి..!

వైద్య విద్య ప్రవేశానికి నిర్వహిస్తున్న నీట్ పరీక్షలో జరిగిన పొరపాట్లు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. పబ్లిక్ పరీక్షల్లో మెరిట్ సాధించిన ఎంతో మంది విద్యార్థులకు సున్నా మార్కులు రావడంతో హతాశులయ్యారు. తాజాగా మధ్య ప్రదేశ్ కు చెందిన విధి సూర్యవంశీ అనే అమ్మాయి నీట్ లో మంచి మార్కులు వస్తాయని ఊహించింది. అయితే అనుకోకుండా కేవలం 6 మార్కులే వచ్చాయి. దీంతో ఆ విద్యార్థిని కుంగిపోయింది. 

డాక్టర్ కావాలనకున్న తన కలలు ఛిద్రమవడంతో విధి తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురుకు ఇంత తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. అందుకే తమ అమ్మాయి ఓఎంఆర్ షీట్ ను తెప్పించి చూశారు. అందులో విధి సూర్యవంశీ 720 మార్కులకు 590 మార్కులు సాధించింది. తమ కూతురు ప్రాణాన్ని అధికారుల తప్పిదం వల్లే పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

Leave a Comment