‘నీట్’ కోసం 700 కి.మీ ల ప్రయాణం..10 నిమిషాల ఆలస్యంతో పరీక్ష మిస్..!

10 నిమిషాల ఆలస్యం వల్ల ఓ విద్యార్థి నీట్ పరీక్ష రాయలేకపోయాడు. ఇందులో ఏముంది..చాలా మందికి ఇలా జరుగుతుంది అనుకుంటున్నారా.. అయితే ఆ విద్యార్థి పరీక్షకు హజరయ్యేందుకు ఎంత కష్టపడ్డాడో తెలిస్తే అలా అనిపించదు… ఆ విద్యార్థి పరీక్ష రాసేందుకు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు..10 నిమిషాలు ఆలస్యం అయిన కారణంగా ఆ విద్యార్థిని పరీక్ష హాలులోకి ప్రవేశం కల్పించలేదు. ఎంత బతిమిలాడినా అనుమతించలేదు..దీంతో ఆ విద్యార్థికి ఈ సంవత్సరం వృధా అయింది.

బీహార్ లోని దర్బంగాకు చెందిన సంతోష్ కు నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షకు కోల్ తతాలో సెంటర్ పడింది. దీంతో సంతోష్ శనివారం ఉదయం 8 గంటలకు బస్సు ఎక్కి ముజఫర్ పూర్ చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పట్నాకు వెళ్లే బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీని వల్ల ఆరు గంటలు ఆలస్యమైంది. దీంతో పట్నాలో 9 గంటలకు బస్సు ఎక్కితే ఆదివారం మధ్యాహ్నం 1.06 నిమిషాలకు కోల్ కతాకు చేరుకున్నాడు. 

అక్కడి నుంచి ట్యాక్సీలో పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే 10 నిమిషాలు ఆలస్యమైందని సంతోష్ కు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వలేదు. దీంతో అతడి శ్రమకు ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష మొదలైందని, నిజానికి 1.40 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నానని, కానీ 10 నిమిషాలు ఆలస్యమైందన్న కారణంతో తనను లోపలికి అనుమతించలేదని సంతోష్ ఆవేదన చెందాడు. పది నిమిషాల ఆలస్యం తనను నీట్ కు దూరం చేసిందని, దీంతో ఏడాది సమయం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు..

 

Leave a Comment