పది పరీక్షల రద్దు ప్రసక్తే లేదు : మంత్రి సురేష్

ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంపీ భరత్ తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

కరోనా నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ వస్తున్నామని, పరీక్షలను రద్దు చేసే ప్రసక్తే లేదని అన్నారు. కరోనా ఉధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదని, ప్రతిపక్షాలు కావాలని రాద్దాంతం చేస్తున్నాయని తెలిపారు. 

నారా లోకేష్ చదువుకోవడానికి అప్పట్లో సత్యం కంప్యూటర్స్ ఉందని, పేద విద్యార్థులకు ఎటువంటి సహకారం ఇప్పుడు లేదని చెప్పారు. పదో తరగతి ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ప్రమాణం అని తెలిపారు. కాబట్టి పరీక్షలు కచ్చితంగా నిర్వహంచి తీరుతామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి సురేష్ చెప్పుకొచ్చారు. 

 

Leave a Comment