నో జీన్స్, టీ షర్ట్.. ఓన్లీ పార్మల్స్ : సీబీఐ డైరెక్టర్ 

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ సిబ్బందికి డ్రెస్ కోడ్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విధి నిర్వహణలో ఉద్యోగులు ఎవరూ జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూస్ ధరించకూడదని, ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైస్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 

సీబీఐలో పనిచేసే అధికారులు, సిబ్బంది జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూ వేసుకోవద్దని, గడ్డం కూడా పెంచుకోవద్దని జైస్వాల్ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ ఇకపై ఫార్మల్ డ్రెస్ మాత్రమే వేసుకుని రావాలని ఆదేశాలు జారీ చేశారు. సీబీఐలో విధులు నిర్వర్తించే మహిళా అధికారులు కూడా చీర, షాధారణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని రావాలని, అలంకరణలతో కార్యాలయాలకు రావద్దని చెప్పారు. దుస్తుల విషయంలో ఈ నిబంధనలను అధికారులు, సిబ్బంది అందరూ కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. 

 

Leave a Comment