ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తే.. ఫ్రైడ్ చేసిన టవల్ వచ్చింది..!

ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డ్ చేస్తున్నారు. తమకు ఇష్టమైనవి తెప్పించుకుని లాగించేస్తున్నారు. వంట చేసే కష్టం లేకపోవడంతో చాలా మంది ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ కే మొగ్గుచూపుతున్నారు. అయితే అప్పుడప్పుడు మనం తెప్పించుకునే ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ ఐటం రావడంతో కస్టమర్ షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆన్ లైన్ లో ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తే డీప్ ఫ్రై చేసిన టవల్ వచ్చింది. 

ఫిలిప్పీన్స్ కు చెందిన అలిక్ పెరెజ్ అనే మహిళ తన కొడుకు కోసం ఆన్ లైన్ లో ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది. జొల్లిబీ అనే రెస్టారెంట్ నుంచి ఆ పార్సిల్ చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చింది. అప్పటికే బాగా ఆకలి మీద ఉన్న వారు ఆ చికెన్ ముక్కను కత్తితో కట్ చేసేందుకు ప్రయత్నించింది. 

అయితే ఆ చికెన్ ముక్క కట్ కాలేదు. దీంతో వెంటనే తన భర్తను పిలిచి దీని సంగతి చూడాలని చెప్పింది. అతడు ఆ చికెన్ ముక్కను తీక్షణింగా పరిశీలించి చూడగా.. అది ఫ్రైడ్ చికెన్ కాదని, డీప్ ఫ్రై చేసిన టవల్ అని తేలింది. ఈ విషయాన్ని అలిక్ సోషల్ మీడియాలో పెట్టింది. సదరు రెస్టారెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేసింది.  

ఈ ఘటనపై జొల్లిబీ రెస్టారెంట్ యాజమాన్యం సందించింది. ఆ ఏరియాలో తమ రెస్టారెంట్ ను మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జరిగిన దానికి క్షమాపణలు కోరింది. మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటామని తెలిపింది.    

Leave a Comment