లాక్ డౌన్ ఎఫెక్ట్ : సూరత్ లో అల్లర్లు

గుజరాత్ లోని సూరత్ లో సోమవారం అల్లర్లు చెలరేగాయి. వేతనాలు లేక, తిండి లేక అవస్థలు పడుతున్న కార్మికులు ఆందోళనకు దిగారు. వారిని నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్న పోలీసులపై దాడికి దిగారు.

 సూరత్ లోని వివిధ ప్రరిశ్రమల్లో వేలాది వలస కార్మికులు పని చేస్తున్నారు. వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వేలాది సంఖ్యలో కార్మికులు రావడంతో వారందరినీ ఒకేసారి తరలించడం మంచిది కాదని గుజరాత్ ప్రభుత్వం భావించింది. దశల వారీగా వారిని వారి సొంత ఊర్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

అయితే కార్మికులు తమకు సరైన తిండి దొరకడం లేదని, డబ్బులు లేవని, తాము ఎలాగోలా తమ స్వస్థలాలకు వెళ్తామంటూ వలస కార్మికులు ఆందోళనకు దిగారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులపై వలస కార్మికులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులకు, వారి మధ్య తీవ్రస్థాయి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో సూరత్ వీధులు రక్తసిక్తమయ్యాయి. 

Leave a Comment