మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఇంట్లో విషాదం.. కుమారుడు జైన్ నాదేళ్ల మృతి..!

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఇంట్లో విషాదం జరిగింది. ఆయన కుమారుడు జైన్ నాదేళ్ల(26) మృతి చెందాడు. జైన్ పుట్టినప్పటి నుంచి మెదడు సంబంధిత వ్యాధి(సెలెబ్రల్ పాల్సీ)తో బాధపడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం ఆరోగ్యం విషమించి మరణించాడు. జైన్ నాదేళ్ల మృతితో సత్యనాదేల్ల కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

సత్యనాదేళ్ల, అను నాదేళ్ల దంపతుల పెద్ద కుమారుడు జైన్ నాదేళ్ల. జైన్ 1996 ఆగస్టు 13న జన్మించాడు. అయితే పుట్టినప్పటి నుంచి సెరబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి గురైన వారిలో మెదడు శాశ్వతంగా దెబ్బతినడం, అసాధారణమైన ఎదుగుదలతో ఈ సమస్య వస్తుంది. శారీరక కదలికలు, కండరాలపై నియంత్రణ లోపిస్తుంది. 

జైన్ నాదేళ్ల ఈ వ్యాధి గుర్తించినప్పటి నుంచి వీల్ చైర్ కే పరిమితయ్యాడు. దీంతో సత్య నాదేళ్ల కుటుంబం ఎంతగానో కుంగిపోయింది. జైన్ నాదేళ్ల పుట్టకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు 2017 అక్టోబర్ లో తొలిసారిగా సత్యనాదేళ్ల బయటి ప్రపంచానికి వెల్లడించారు.

Leave a Comment