రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అందరూ ఊహించినట్లే జరిగింది. గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. వాణిజ్య సిలిండ్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వాణిజ్య సిలిండర్ ధరపై రూ.105 పెంచాయి. 5 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ.27 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు వెల్లడించాయి.
ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2012కు చేరింది. ఇక కోల్ కతాలో రూ.2089, ముంబాయిలో రూ.1962, చెన్నైలో రూ.2185.5గా ఉంది. 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.569కి చేరింది. ఫిబ్రవరి 1న వాణిజ్య సిలిండర్ పై రూ.91.5 తగ్గించిన చమురు కంపెనీలు నెల రోజుల్లోనే రూ.105 పెంచాయి. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. అయితే రానున్న రోజుల్లో ఈ ధరలు పెరిగి సామాన్యుడిపై కూడా భారం పడనుందట..