ఖర్జురం పాలతో మగవారిలో ఆ సమస్య దూరం..!

ప్రకృతి నుంచి లభించిన ఫలాల్లో ఖర్జురం ఒకటి.. ప్రాచీన కాలం నుంచి పండించే పంట.. ఈ ఖర్జురంలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. అంతేకాదు.. ఖర్జూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మగవారికి ఈ ఖర్జూరం మరింత లాభదాయకమట.. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరాన్ని మించింది లేనేలేదు.. 

ఖర్జూర పండ్లలో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్, ఫైబర్, పొటాషియం పెద్ద మొత్తంలో ఉంటాయి. రక్తహీనత సమస్య ఉన్న వారు డైట్ లో ఖర్జూరం చేరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఖర్జూరంలో ఉంటే పోషక పదార్థాలు శరీరంలో పూర్తిగా జీర్ణమవుతాయి. పండిన ఖర్జూరాల్లో 80 శాతం చక్కెర ఉంటుంది. అందుకే దీనిని ప్రకృతి మిఠాయి అని కూడా అంటారు. 

ఖర్జూరంతో ఆరోగ్య ప్రయోజనాలు:

  • ప్రతి రోజూ పరగడుపున ఖర్జూరాలు తినగడం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి ఎనీమియా సమస్య దూరమవుతుంది. 
  • ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకం సమస్య దూరం చేస్తుంది. జీర్ణక్రియ కూడా సజావుగా సాగుతుంది. 
  • ముఖ్యంగా ఖర్జూరం మగవారిలో సంతాన సాఫల్యత సామర్థ్యాన్ని పెంచుతుంది. స్పెర్మ్ కౌంట్ లేదా స్పెర్మ్ మొటిలిటీ వల్ల మగవారిలో సంతాన సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ పాలతో కలిపి ఖర్జూరం తీసుకోవడం వల్ల మగవారిలో ఫెర్టిలిటీ పెరుగుతుంది. 2-3 ఖర్జూరాలను పాలలో ఉడికించి ప్రతిరోజూ తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. 
  •  ఖర్జూరాలు గర్భం చివరి నెలల్లో గర్భాశయ కండరాలను బలోపేతం చేసే ఉత్ప్రేరకాలు కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఖర్జూరాలు డెలివరీ సమయంలో గర్భాశయానికి సహకరిస్తాయి. 
  • ఖర్జూరం పాలు తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు తగ్గుతాయి. పాలలో ఖర్జూరం వేసి తీసుకోవడం వల్ల చర్మం మెరిసిపోవడంతో పాటు చర్మానికి పోషకాలు అందుతాయి. అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది. 
  • పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఎండు ఖర్జురాలను పాలలో మరిగించి తాగితే ఎముకలు, దంతాల సమస్యను తగ్గించవచ్చు.   

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment