మోడీకి కేటీఆర్ కౌంటర్.. అలా చేస్తే రూ.70కే లీటర్ పెట్రోల్..!

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి రాష్ట్రాలే కారణమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీ సందర్భంగా వ్యాట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలను రాష్ట్రాలే తగ్గించాలన్న ప్రధాని వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వ వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. వ్యాట్ పెంచకపోయినా.. వ్యాట్ పెంచారంటూ తెలంగాణ పేరు ప్రస్తావించడంపై ఆయన మండిపడ్డారు. ఇదేనా మీరు మాట్లాడే కోఆపరేటివ్ ఫెడరలిజం అని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక ఏనాడు పెట్రోల్ పై వ్యాట్ పెంచలేదని, ఒక్కసారి కేవలం సవరణ చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్ కారణంగా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 41 శాతం వాటా దక్కడం లేదన్నారు. సెస్ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11.4 శాతాన్ని లూటీ చేస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేవలం 29.6 శాతం వాటా మాత్రమే దక్కుతోందని కేటీఆర్ చెప్పారు. అసలు సెస్ అనేది రద్దు చేస్తే దేశంలో రూ.70కే లీటర్ పెట్రోల్, రూ.60కే లీటర్ డీజిల్ ఇవ్వొచ్చని కేటీఆర్ అన్నారు.   

 

 

Leave a Comment