భార్యతో శృంగారం చేసిన 10 నిమిషాలకే మతిమరుపు..!

ఐర్లాండ్ దేశంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ వ్యక్తికి తన భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు వచ్చింది. ఐరిష్ జర్నల్ కథనం ప్రకారం.. 66 ఏళ్ల ఐరిష్ వ్యక్తి తన భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే మతిమరుపునకు గురయ్యాడు. శృంగారం చేసిన తర్వాత తన ఫోన లో తేదీని చూసుకున్నాడు. 

అనే నిన్న మా పెళ్లి రోజు కదా.. ఇదెలా మర్చిపోయాను అనుకున్నాడు.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. ముందు రోజు వారి పెళ్లి రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి రోజు వేడుక జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు భార్య, పిల్లలు ఎంతో ప్రయత్నించారు. పెళ్లిరోజు వేడుక గురించి అస్సలు గుర్తుకు రాలేదు. 

విశేషం ఏంటంటే.. తన పేరు, వయసు, పాత విషయాలను మాత్రం ఆ వ్యక్తి గుర్తు పెట్టుకున్నాడు. ఆ వ్యక్తిని వైద్యులు వద్దకు తీసుకెళ్లగా.. ఇది స్వల్పకాలిక మతిమరుపు అని, దీనిని ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా అంటారని చెప్పారు. ఇది 50 -70 ఏళ్ల మధ్య వయసు వారిపై ప్రభావం చూసిస్తుందని అన్నారు. గతంలోనూ ఈ వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురైంది. అది కూడా భార్యతో శృంగారంలో పాల్గొన్న సమయంలోనే జరగడం గమనార్హం.. 

  

Leave a Comment