ఇదేం విచిత్రం.. పాలు ఇస్తున్న మేకపోతు..!

మేకలు, ఆవులు, గేదెలు పాలు ఇవ్వడం చూశాం.. కానీ మేకపోతు పాలు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా? ఈ అరుదైన ఘటన కర్ణాటకలోని హవేరీలో జరిగింది. హనగల్ తాలూకాలోని నరేగల్ గ్రామానికి చెందిన సాదిక్ కుటుంబం ఓ మేకపోతును పెంచుతోంది. ఏడాదిన్నర వయసు ఉన్న ఈ మేకపోతు కొద్దిరోజులుగా పాలు ఇస్తోంది.. 

రోజుకు సమారు లీటర్ వరకు పాలు ఇస్తోంది ఈ మేకపోతు.. మొదట ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. దీంతో అందరి ముందే పాలు పితకడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మేకపోతు పాలు ఇవ్వడానికి హార్మోన్ల ప్రభావమే కారణమంటున్నారు వైద్యులు.. 

  

Leave a Comment