అభిమాని కూతురు పెళ్లికి మెగాస్టార్ సాయం..!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి పెద్ద మనుసును చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న తన అభిమానికి ఆర్థిక సాయం చేశారు. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. శేఖర్ గత 30 సంవత్సరాలుగా మెగాస్టార్ కు వీరాభిమాని. రాష్ట్ర స్థాయిలో చిరంజీవి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడు. 

శేఖర్ కు వర్ష, నిశిత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈనెల 19న పెద్దమ్మాయి వర్ష పెళ్లి జరగనుంది. బిడ్డ పెళ్లి విషయంలో శేఖర్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. శేఖర్ కష్టాన్ని తెలుసుకున్న చిరంజీవి తన వీర అభిమానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. చిరంజీవి పంపిన ఆ లక్ష రూపాయల చెక్కును శేఖర్ కు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందించారు. రక్త సంబంధీకులు చేయని సాయాన్ని చిరంజీవి చేశారని, ఆయన రుణం తీర్చుకోలేనిదని ఈ సందర్భంగా శేఖర్ భావోద్వేగానికి గురయ్యాడు. 

Leave a Comment