‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో చేపట్టిన మేకలు, గొర్రెల పంపిణీ ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా, మొత్తం రూ.1869 కోట్ల వ్యయంతో పథకం అమలు చేస్తున్నారు. 

  • ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తారు. 
  • ఒక్కో యూనిట్ లో 14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలతో పాటు పొట్టేలు లేదా మేకపోతు(14+1) ఇస్తారు. 
  • ఒక లబ్ధిదారుడికి ఒక యూనిట్ మాత్రమే ఇస్తారు. 
  • గొర్రెలలో నెల్లూరు బ్రౌన్, జోడిపి, మాచర్ల బ్రౌన్, విజయనగరం జాతులు, మేకలలో బ్లాక్ బెంగాల్, లేదా స్థానిక జాతులతో నచ్చిన జీవాన్ని లబ్ధిదారులు కొనుగోలు చేయవచ్చు. 
  • ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం అల్లానా ఫుడ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చకుంది. 
  • దీని ద్వారా మాంసం, మాంస ఉత్పత్తులు విక్రయం ద్వారా ఆదాయం సమకూర్చుకునే ఆసక్తి గల ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇస్తుంది. నాణ్యమైన, ప్రాసెస్ చేసిన మాంసాన్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

 

Leave a Comment