వేడుకగా మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం..పిక్స్ సూపర్!

ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవల హీరో నితిన్, రానాల వివాహం జరిగింది. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో వైభవంగా జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు ఫ్యామిలీ మెంబర్స్ హజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, సాయి ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Comment