‘పబ్జీ గేమ్’ కి బానిసై ప్రాణాలు కోల్పోయాడు..పేరెంట్స్ బీ అలర్ట్..!

పబ్ జీ గేమ్ కు యువత బానిస అవుతోంది. పబ్ జీ గేమ్ ఇప్పటికే ఎంతో మందిని ప్రాణాలు కోల్పోతున్నారు. యువత జీవితాలతో ఆడుకుంటోంది ఈ పబ్ జీ మొబైల్ గేమ్.. తాజాగా పబ్జీ గేమ్  మరో యువకుడిని బలిగొంది.  పశ్చిమ గోదావరి ద్వారకాతిరుమలకు చెందిన 16 ఏళ్ల యువకుడు కొంత కాలంగా పబ్జీ(ఫ్రీ ఫైర్) గేమ్ కు బానిసయ్యాడు. ఇంట్లో ఖాళీగా ఉండటంతో రోజుల తరబడి ఆ గేమ్ ఆడుతూ గడిపేవాడు. పబ్జీ ఆడుతూ ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం మానేశాడు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పబ్జీ గేమ్ ఆడేవాడు. 

దీంతో ఆ యువకుడు అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రమాదకరమైన డీహైడ్రేషన్ కు గురయ్యాడని, డయేరియా బారిన కూడా పడ్డాడని వెల్లడించారు. దీంతో చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఇలా ఎంతో మంది యువత పబ్జీకి బానిసై ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త పడి తమ పిల్లలను పబ్జీకి బానిస కాకుండా చూసుకోవాలి. వారు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఎంత సమయం గడుపుతున్నారో గమనిస్తూ ఉండాలి. లేకుంటే జరగాల్సిన దారుణం జరిగిపోతుంది.  

Leave a Comment