ఈ చిన్నారి హెలికాప్టర్ షాట్ కి ఫిదా అవ్వాల్సిందే..!

మనకు క్రికెట్ లో హెలికాప్టర్ షాట్ అంటే గుర్తుకొచ్చేది ఎవరంటే..అది ధోనినే..ధోనిలా మరెవ్వరూ హెలికాప్టర్ షాట్ ను ఆడలేరు. హెలికాప్టర్ షాట్ కొట్టాలంటే దానికి ఎంతో ప్రాక్టిస్ చేయాలి. అలాంటిది ఒక చిచ్చరపిడుగు అవలీలగా హెలికాప్టర్ షాట్ ను కొట్టేస్తోంది. హర్యానాలోని రోహ్తక్ కు చెందిన పరి శర్మ అనే ఏడేళ్ల  బాలిక హెలికాప్టర్ షాట్ కొడితే చూపుతిప్పుకోలేము.  ఈ బాలిక తన షాట్లతో మాజీ క్రికెట్ ప్లేయర్ల దృష్టిని ఆకర్శించింది.  

ఈమె టాలెంట్ చూసిన ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ ఫిదా అయ్యారు. ఈమె ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈమె హెలికాప్టర్ షాట్లకు సంబంధించిన వీడియోలను మాజీ క్రికెట్ ప్లేయర్లు ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాదు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ముగ్గురు మాజీ కెప్టెన్లు కూడా ఈమె షాట్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈమె హెలికాప్టర్ షాట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరస్ అవుతుంది. ఈ కింది వీడియో చూసి మీరు కూడా ఈ బాలిక టాలెంట్ ను చూసేయ్యండి..

Leave a Comment