ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్..ఇప్పుడ ఓ దొంగ.. 200 ఇళ్లల్లో చోరీలు..!

చదువులోనే కాదు.. దొంగతనాల్లోనూ ఓ దొంగ రికార్డు సాధించాడు.. చదువులో గోల్డ్ మెడల్ సాధించిన ఈ దొంగ.. చోరీల్లో 200 ఇళ్లల్లో దొంగతనాలు చేశాడు. చివరికి హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీసులకు చిక్కాడు.. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ 2004లో ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడ్డాడు. అందుకోసం సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేయడం ప్రారంభించాడు.. 

హైదరాబాద్ నగరంలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న వంశీకృష్ణ.. నగరంతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో దొంగతనాలు చేశాడు.. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చూసి చోరీకి పాల్పడతాడు. అలా 2006 నుంచి ఇప్పటి వరకు 200 ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.  వంశీకృష్ణ వివిధ కేసుల్లో సుమారు 67 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అతనిపై పోలీసులు రెండుసార్లు పీడీ యాక్ట్‌ కూడా నమోదు చేశారు. 

గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం కేసులో వంశీకృష్ణను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 19 తులాల బంగారం, రూ.3 లక్షల నగదుతో పాటు రెండు సెల్ పోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడి గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించి.. ఉద్యోగం వదిలేసి చోరీలు ఎందుకు చేస్తున్నాడో అని తలలు పట్టుకున్నారు.. 

 

Leave a Comment