AP: పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఐఏఎస్..!

ఈరోజుల్లో ఆర్థిక స్తోమత ఉన్నా.. లేకున్నా.. పిల్లలను మాత్రం ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి చదివిస్తున్నారు తల్లిదండ్రులు.. ఇక ప్రభుత్వ అధికారుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ..ప్రభుత్వ జీతం తీసుకుంటూ.. తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు..

అయితే వీరికి భిన్నంగా ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. శాప్ ఎండీ ఎన్.ప్రభాకర్ రెడ్డి తన కుమార్తె, కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. విజయవాడ పటమటలోని కోనేరు బసవపున్నయ్య జెడ్పీ హైస్కూల్ లో జాయిన్ చేశారు. ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మి తన ఇద్దరు పిల్లలకు ఆ స్కూల్ లో అడ్మిషన్లు తీసుకున్నారు. కూతురికి 8వ తరగతిలో, కుమారుడిని 6వ తరగతిలో చేర్పించారు.  

స్కూల్ వాతావరణం, విశాలమైన ఆటస్థలం, అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని, నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోయాయని, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడంతో పిల్లలను కోనేరు బసవయ్య చౌదరి స్కూల్లో జాయిన్ చేసినట్లు వీరు పేర్కొన్నారు. వేసవి సేలవుల అనంతరం ఏపీలో పాఠశాలలు మంగళవారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. 

 

Leave a Comment