ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా: కృతి సనన్

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అది ప్రభాస్. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనేది సస్పెస్ గానే ఉంది. దాదాపు ప్రభాస్ తోటి హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ప్రభాస్ ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారిడిగా ఉన్నాడు. ఈక్రమంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఈ బ్యూటీకి పలు ప్రశ్నలు ఎదురు కాగా, అందులో ‘ప్రభాస్.. టైగర్ ష్రాఫ్.. కార్తీక్ ఆర్యన్’ ఈ ముగ్గురి హీరోల్లో మీరు ఎవరితో డేట్ కు వెళ్తారు? ఎవర్ని వివాహం చేసుకుంటారు? ఎవర్నీ ఫ్లర్ట్ చేస్తారు? అనే ప్రశ్నలకు కృతి సనన్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని, టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ కు వెళ్తానని, కార్తీక్ ఆర్యన్ ను ఫ్లర్ట్ చేస్తానని కృతి సనన్ సమాధానం చెప్పారు.  

కాగా, ప్రభాస్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా ‘ఆదిపురుష్’ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నారు. 

 

Leave a Comment