మధ్యాహ్నం నిద్ర లాభమా.. నష్టమా? 

చాలా మంది మధ్యాహ్నం భోజనం చేశాక ఓ కునుకు తీస్తుంటారు. వాస్తవానికి మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వచ్చే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ నిద్ర ఆరోగ్యానికి మంచిదా లేక హాని చేస్తుందా ?.. నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది రాత్రి పూట నిద్ర పట్టక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారు పగటి పూట నిద్రపోతూ ఉంటారు. మరికొంత మంది రాత్రి పూట నిద్రంచడంతో పాటు మధ్యామ్నం భోజనం చేశాక నిద్ర పోతారు. అయితే పగతి పూట నిద్ర ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

దీర్ఘకాలంగా పగటి నిద్ర కొనసాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో అధిక బరువు పెరగడంతో పాటు, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదని మధ్యాహ్నం నిద్రపోయే వారు రాత్రి నిద్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 

ఒకవేళ మధ్యాహ్నం నిద్రపోవాల్సి వస్తే 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే నిద్రించడం మంచిది. మధ్యాహ్నం పూట 30 నిమిషాల వరకు నిద్రపోతే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగని మధ్యాహ్నం పడుకుని అదే పనిగా గంటల తరబడి నిద్రించడం వల్ల కోరి సమస్యలను తెచ్చుకోవాల్సి వస్తుంది. 30 నిమిషాలకు మించకుండా ఒక కునుకు తీయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.  

ఇక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నిద్రించడం సరైన సమయంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగడం, స్మోక్ చేయడం, చాక్లెట్లు తినడం లాంటివి చేయకూడదు. ఫోన్ లో వీడియోలు, మెస్సేజ్ లు చూసి ఎక్కువ స్ట్రయిన్ అవ్వరాదు. టీవీ చూస్తూనే నిద్రలోకి జారుకోవడం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

Leave a Comment