‘చెప్పేవి గీత సూక్తులు.. పనులు మాత్రం రావణుడివి’.. బీజేపీ నేతలపై హాట్ కామెంట్స్..!

ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిపోడియా బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు. బీజేపీ నేతలను రావణుడితో పోల్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.  గుజరాత్ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు సిలబస్ లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కాగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనీష్ సిపోడియా స్వాగతించారు. ఇది మంచి నిర్ణయం అని ప్రశంసించారు. 

అయితే బీజేపీ నేతలను ప్రశంసిస్తూనే.. వారిపై సెటైర్లు వేశారు. గుజరాత్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని, భగవద్గీతలోని నైతిక విలువలు మరియు సూక్తులు విద్యార్థులకు నేర్పించడం మంచి పరిణామం అని అన్నారు. భగవద్గీను పరిచయం చేసే వ్యక్తులు ముందుగా గీతలోని విలువలను ఆచరించాలన్నారు. కొంత మంది గీత గురించి మాట్లాడుతారే కానీ వారి పనులు మాత్రం రావణుడిలా ఉంటాయని బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు.     

Leave a Comment