వీడియో వైరల్.. ఒక కాలుతో ఫుట్ బాల్ ఆడుతున్న బాలుడు..!

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఏదైనా సాధించాలనే తెగువ దాని కోసం చేసే ప్రయత్నం దేనినైనా సాధించేలా చేస్తుంది. ఏమీ చేయలేక కుంగిపోతున్న వారికి ఈ బాలుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒంటికాలితో ఫుట్ బాల్ ఆడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు. అంతే ఒకకాలుతోనే సైకిల్ కూడా తొక్కుతాడు.

మణిపూర్ రాజధాని ఇంపాల్ కు చెందిన కునాల్ శ్రేష్టకు తొమ్మిదేళ్లు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే కునాల్ పుట్టగానే ఒక కాలు లేకుండానే పుట్టాడు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం ఏప్పుడు ఆ లోటులేకుండా పెంచారు. ప్రత్యేకమైన వ్యక్తులు ప్రత్యేక లక్షణాలతోనే పుడతారని ధైర్యం చెప్పారు. అసలు తనకు కాలు లేదని విషయం తెలియకుండా పెచంచారు.

 కునాల్ కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఎప్పుడు చదువుల్లో ఫస్ట్ ఉంటాడు. అంతే కాదు చేతి కింద క్రచ్ తో ఫుట్ బాల్ కూడా ఆడుతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కునాల్ ఆత్మస్థైర్యాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

Leave a Comment