SVBCలో పోర్న్ లింక్ కలకలం..!

టీటీడీలో కలకలం రేపింది. తిరుమల ఎస్వీబీసీ ఛానల్ ఉద్యోగి ఓ భక్తుడికి పోర్న్ సైట్ లింక్ పంపాడు. శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్ పంపగా.. దీనికి సమాధానంగా ఎస్వీబీసీ ఉద్యోగి రిప్లయ్ మెయిల్ పంపాడు. ఆ లింక్ క్లిక్ చేసి చూడగా పోర్న్ సైట్ లింక్ ప్రత్యక్షమైంది. 

దీంతో షాకైన భక్తుడు ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డిలకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన వారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో విజిలెన్స్, సైబర్ క్రైమ్ అధికారులు తనిఖీ నిర్వహించారు. పోర్న్ వీడియో పంపిన ఉద్యోగితోపాటు పోర్న్ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు. వీరందరిపై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 

Leave a Comment