ఏపీలో భారీ వర్ష సూచన..

ఆంధ్రప్రదేశ్ లో రానున్న 4,5 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహన శాఖ వెల్లడించింది. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

అదే విధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, క్రిష్ణ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలంతా అప్రతమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. 

 

Leave a Comment