మామిడికాయ రూపంలో కోడి గుడ్డు..!

సాధారణంగా కోడి గుడ్డు గుండ్రంగా లేదా వర్తులాకారంగా ఉంటుంది. కానీ ఈ గుడ్డు మాత్రం అచ్చం మామిడికాయ రూపంలో ఉంది. రెండు పక్కపక్కన పెడితే కోడి గుడ్డు లేక మామిడి కాయనా అని గుర్తు పెట్టలేనంతగా ఉంది. మామిడికాయ రూపంలో ఉన్న ఈ కోడి గుడ్డు చూపరులను అబ్బుర పరుస్తోంది.. 

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన కిరాణ వ్యాపారి బొమ్మిడి సత్తిబాబు తన దుకాణంలో అమ్మడానికి కోడి గుడ్లు తెప్పించాడు. వాటిలో ఒక గుడ్డు అచ్చం మామిడికాయ ఆకారంలో ఉంది. మామిడి కాయ, కోడి గుడ్డు రెండు పక్కపక్కన పెట్టి చూస్తే ఏమాత్రం తేడా లేకుండా ఉన్నాయి. తెల్ల మామిడి కాయ ఏమో అన్నట్లుగా ఉంది. ఈ గుడ్డును చూసేందుకు స్థానికులు షాపు వద్దకు వస్తున్నారు. ఈ గుడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. 

Leave a Comment