వచ్చే ఎన్నికల్లో వారికి నో టికెట్.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. 2024 ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశించారు. సీఎం జగన్ అధ్యక్షతన అసెంబ్లీ కాన్పరెన్స్ హాల్ లో వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్ ఎమ్మెల్యేలకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 

ఈ భేటీలో ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతిరోజూ నివేదిక తెప్పించుకుని సమీక్షిస్తామని,  సర్వేల ఆధారంగానే టికెట్లు ఉంటాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సమగ్ర నివేదిక తన వద్ద ఉందన్నారు. 

 మే నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలని సూచించారు. ఏప్రిల్ నాటికి జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. కొత్త జిల్లాల వారీగా రీజనల్ కోఆర్డినేటర్లను నియమిస్తామన్నారు. జూలై 8న వైఎస్ఆర్సీపీ ప్లీనర్ నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు. మంత్రి వర్గాన్ని కూడా పునర్ వ్యవస్థీకరిస్తామని సీఎం జగన్ చెప్పారు. 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తామన్నారు. టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు. 

   

Leave a Comment