మొబైల్ ఎక్కువగా వాడితే.. పురుషుల్లో మగతనం పోతుందట..!

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఒక అత్యవసర వస్తువు అయిపోయింది. మొబైల్ లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు.. అయితే మొబైల్ ఫోన్ ని అతిగా వాడితే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో లైంగిక, సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరిస్తున్నారు. 

స్పెర్మ్ నమూనాలపై దక్షిణ కొరియా పరిశోధకుల నుంచి వచ్చిన కొన్ని తీర్మానాలను షెఫీల్డ్ యూనివర్సిటీలో ఆండ్రాలజీ ప్రొఫెసర్ అలన్ పేసీ పరిశీలించారు. మొత్తం 18 అధ్యయనాల్లో 4,280 స్పెర్మ్ నమూనాలపై జరిగిన అధ్యయనం గురించి ఆయన పరిశీలన చేశారు. మొబైల్ నుంచి విడుదల అయ్యే విద్యుత్ అయస్కాంత తరంగాలు వీర్య కణాలను దెబ్బతీస్తున్నాయని ఆ పరిశోధనలో తేలింది. 

ఇక పురుషులు తమ మగతనాన్ని కోల్పోకుండా ఉండాలంటే మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని అలన్ పేసీ సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వల్లే పురుషుల్లో లైంగిక సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. పురుషుల వీర్యకణాల నాణ్యతకు ఫోన్ మంచిది కాదన్నారు. ఈ అధ్యయనం పదేళ్లుగా జరుగుతుందని, ఈ అధ్యయనం స్పెర్మ్-మొబైల్ వినియోగానికి మధ్య గల ప్రమాదకర కారణాలను ఇంకా స్పష్టంగా వెల్లడించలేదని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా పరిశోధన జరగాలన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం పురుషులకు మొబైల్ చాలా ప్రమాదకరమన్నారు. పురుషులు మొబైల్ ఫోన్లను జేబుల్లో కాకుండా బ్యాగుల్లో ఉంచుకోవాలని పేసీ సూచించారు. 

మొబైల్ ఫోన్ ఉపయోగించేవారు తమ స్పెర్మ్ నాణ్యతను కాపాడుకోవడానికి సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని పుసాన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పరిశోధకులు డాక్టర్ యున్ హక్ కిమ్ సూచించారు. అయితే ఇప్పుడు ఉన్న మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే విద్యుత్ అయస్కాంత తరంగాలు స్పెర్మ్ కౌంట్ పై చూపే ప్రభావం గురించి లోతుగా పరిశోధనలు అవసరమని తెలిపారు. 

 

Leave a Comment