కాలేజీ విద్యార్థుల కిస్సింగ్ కాంపిటీషన్.. వీడియో వైరల్..!

కర్నాటక రాష్ట్రం మంగళూరులోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ముద్దులు పెట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.  స్టూడెంట్స్ కిస్సింగ్ కాంపిటీషన్ నిర్వహించి వీడియో తీసిన స్టూడెంట్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు బావతగుడ్డేలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఓ అపార్ట్ మెంట్ లో ముద్దుల పోటీలు నిర్వహించుకున్నారు..

ఇందులో భాగంగా అందరి ముందు కౌగిలింతలు, లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. దీనిని ఓ విద్యార్థి వీడియో తీశాడు.. ఈ వీడియో వాట్సాప్ ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ వీడియోను చిత్రీకరించిన విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు.  

పోలీసులు వీడియోలోని విద్యార్థుల సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. అలాగే ముద్దుల పోటీలో విద్యార్థులు డ్రగ్స్ సేవించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ కిస్సింగ్ కాంపిటీషన్ ఘటన జరిగి ఆరు నెలలు అవుతోందని, వారం కిందట వాట్సాప్ ద్వారా ఓ స్టూడెంట్ దానిని వైరల్ చేశాడని పోలీసులు తెలిపారు. అలాగే కిస్సింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది.  

 

Leave a Comment