దేశంలో జమిలి ఎన్నికలు: కీలక ప్రకటన చేసిన కేంద్రం..!

దేశంలో జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికల అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించింది. పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు.. 

జమిలి ఎన్నికల అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని మార్పులు చేసిందని, వాటిని లాకమిషన్ పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందన్నారు. 

పార్లమెంట్ కు రాష్ట్ర అసెంబ్లీలకు వేర్వేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చ అవుతుందని కేంద్రం తెలిపింది. 2014-22 మధ్య కాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని, ఈ ఎనిమిదేళ్లలో రూ.7 వేల కోట్లకుపైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది. 

 

Leave a Comment