ఏకంగా ఫోన్ నే మింగిన ఘనడు..!

ఓ వ్యక్తి  వింత ప్రయత్నం చేశాడు. ఏకంగా ఫోన్ ను మింగేశాడు. తర్వాత విపరీతమైన కడుపు నొప్పి రావడంతో డాక్టర్ల వద్దకు పరిగెత్తాడు. ఈ ఘటన యూరప్ లోని కోసోవోలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల మేరకు కోసోవో రిపబ్లిక్ ప్రిస్టినాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం నోకియా ఫోన్ 3310 ఫోన్ ను మింగాడు. ఆ ఫోన్ కడుపులో ఇరుక్కుపోయింది. దీంతో కడుపు నొప్పితో తల్లడిల్లిపోయాడు.  అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడి కడుపులో ఫోన్ చూసి షాక్ అయ్యాడు. వైద్యులు ఎంతో చాకచక్యంగా అధునాతన టెక్నాలజీ ఉపయోగించి కడుపులో నుంచి ఫోన్ ను బయటకు తీశారు. అతడికి సర్జరీ చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. ‘అతడికి స్కాన్ చేసి కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించాము. కడుపులో ఫోన్ మూడు ముక్కలుగా ఉంది. అయితే ఆ ఫోన్ బ్యాటరీ అప్పటి వరకు పేలిపోలేదు. అదేగానీ జరిగితే బాధితుడు మరణించేవాడు.’ అని చెప్పాడు.  

 

Leave a Comment