బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే..!

నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకం చికెన్.. రోజూ చికెన్ లేనిదే వారికి ముద్ద దిగదు. ప్రతిరోజూ తినే ఆహారంలో వారికి కచ్చితంగా చికెన్ ఉండాల్సిందే. అయితే మాంసాహార ప్రియులకు తాజా అధ్యయనం ఓ షాకింగ్ విషయం చెప్పింది. బ్రాయిలర్ కోళ్లను తినడం వల్ల అనేక నష్టాలు ఉన్నట్లు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషియన్ వెల్లడించింది. చికెన్ డైలీ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని జర్నల్ లో ప్రచురించింది. 

అయితే ఈ పరిశోధనలకు చాలా తక్కువ మందినే పరిగణనలోకి తీసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. చికెన్ లో బయాక్టీరియా ఎక్కువశాతం ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో సుమారు 300కి పైగా చికెన్ చెస్ట్ ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ చికెన్ లో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. 

ఎక్కువగా చికెన్ తింటే బరువు పెరుగుతారని లండన్ లిండా యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. శాకాహారం తీసుకునే వారితో పోలిస్తే చికెన్ తినే వారిలో కొవ్వు ఎక్కువగా పెరిగినట్లు గుర్తించారు. అయితే కొద్ది మొత్తంలో చికెన్ తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

అమెరికా సొసైటీ ఫర్ మైక్రోబయోలజీ చేసిన అధ్యయనం ప్రకారం చికెన్ లో ఈకోలి అనే బ్యాక్టీరియా ఉంటుందని, ఇది ఆరోగ్యానికి హానికారమని వెల్లడించారు. సుమారు 2500 చికెన్ నమూనాలను పరీక్షంచగా వాటిలో దాదాపు 72 శాతం ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ విషయాలను అమెరికా పరిస్థితులకు అనుగుణంగా చెప్పారు. మన దేశంలో మసాలాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా అలాంటి పరిస్థితి ఉందో లేదో చెప్పలేం. మన దగ్గర పరిశోధనలు చేస్తే అసలు విషయం తెలుస్తుంది.  

Leave a Comment