కుక్కర్ ని పెళ్లి చేసుకున్నాడు.. విడాకులిచ్చాడు..!

రానురాను ప్రజలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. ఇంత వరకు సెక్స్ డాల్స్, జంతువులు, రోబోలను పెళ్లి చేసుకోవడే చూశాం.. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా రైస్ కుక్కర్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బోర్ కొట్టిందో ఏమో.. ఈ దంపతులు ఎక్కువ కాలం జీవించలేకపోయారు. నాలుగు రోజులకే ఆ కుక్కర్ భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అతని పేరు కహిరోల్ ఆనమ్.. అతనికి ఆ కుక్కర్ అంతే ఎంతో ఇష్టమట. అందుకే సెప్టెంబర్ 20న ఆ కుక్కర్ ని పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘వైట్, క్వైట్ పర్ఫెక్ట్.. ఎక్కువ మాట్లాడదు.. వంట బాగా చేస్తుంది.. కల నిజమవుతోంది.. నువ్వు లేకపోతే నా రైస్ ఉడకదు’ అని పోస్టులో క్యాప్షన్ జోడించాడు. 

 ఆ పెళ్లి ఫొటోల్లో కుక్కర్ ను మొద్దుపెడుతూ ఎంతో ప్రేమ ఒలకబోశాడు. పెళ్లి దుస్తులు ధరించి.. పెళ్లి రిజిస్ట్రేషన్ పేపర్లపై సంతకాలు పెడుతూ కనిపించాడు. ఫార్మాలిటిస్ పూర్తి చేసుకున్నాడు. ఇంత హంగామా చేసి నాలుగు రోజులకు కుక్కర్ భార్యకు విడాకులు ఇచ్చేశాడు.. ఎందుకంటే.. అది రైస్ బాగానే వండుతోంది.. కానీ మిగితా వంటలు సరిగ్గా చేయడం లేదని చెప్పాడు. కాగా ఆనమ్ సోషల్ మీడియాలో తరచూ జోక్స్ కంటెంట్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా జోక్ గా చేశాడంతే..  

 

Leave a Comment