హైటెక్ పద్ధతిలో గంజాయి సాగు.. పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది..!

ఓ యువకుడు పోలీసులకే దిమ్మ తిరిగిపోయేలా చేశాడు.. ఇంట్లోనే హైటెక్ పద్ధతిలో గంజాయి పండించాడు. దీనిని మత్తుకు బానిసైన వారికి సరఫరా చేస్తూ భారీగా సంపాదించాడు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ హైటెక్ గంజాయి సాగు బెంగళూరులో జరిగింది. కర్ణాటకకు చెందిన జావెద్ అనే వ్యక్తి ఎంబీఏ పూర్తి చేసి కమ్మనహళ్లి ప్రాంతంలో నివసించేవాడు. గత మూడేళ్లగా మత్తు పదార్థాలకు అలవాటుపడ్డాడు.

ఈక్రమంలో గతేడాది బెంగళూరులో లాక్ డౌన్ పడింది. ఆ సమయంలో బెంగళూరులో భారీ ఎత్తున మత్తు పదార్థాలు వెలుగు చూడగంతో భయపడిపోయాడు. తాను ఉంటున్న ప్రాంతం నుంచి బిదాదికి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ రూ.35 వేల అద్దెతో ఓ విల్లాను తీసుకున్నాడు. అయితే లాక్ డౌన్ కావడంతో మత్తు పదార్థాలు లభించడం కష్టంగా మారింది. అవి దొరక్కపోయే సరికి జావెద్ పిచ్చివాడిగా మారాడు. 

ఆ పరిస్థితిలో అతనికి ఓ ఐడియా వచ్చింది. ఇంట్లోనే గంజాయిని పెంచాలని అనుకున్నాడు. అందుకోసం ఎల్ఈడీ లైట్లను అమర్చి హైడ్రోఫోనిక్ మోడల్ ని సెటప్ చేసుకున్నాడు. తర్వాత డార్క్ వెబ్ నుంచి గంజాయి గింజలను ఆర్డర్ చేశాడు. అలా ఇంట్లో 130 మొక్కల వరకు పెంచాడు. అధునాతన పద్ధతిని ఉపయోగించి దానిని మత్తు పదార్థంగా ఉపయోగించేలా తయారు చేశాడు. వాటిని ఒక్క గ్రాము రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు విక్రయించడం ప్రారంభించాడు. అయితే రెండు రోజుల క్రితం డీజే హళ్లి ప్రాంతంలో పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి విచారించారు. అప్పుడు జావేద్ వ్యవహరం బట్టబయలైంది. జావేద్ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా.. అక్కడ ఉన్న హైటెక్ పద్ధతిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈకేసుకు సంబంధించి పోలీసుల నలుగురు డ్రగ్ పెడ్లర్స్, ఇద్దరు ఇరానియన్లను అదుపులోకి తీసుకున్నారు. 

Leave a Comment