ఫోన్ లో మద్యం ఆర్డర్ చేశాడు..రూ.1.61 లక్షలు పోగొట్టుకున్నాడు..!

ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. బ్యాంకింగ్ సంబంధించిన ఓటీపీలు ఎవరికీ చెప్పొదని పోలీసులు, బ్యాంకులు హెచ్చరిస్తున్నా..కొందరు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. దీంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి మద్యం కొనగోలుకు ఆన్ లైన్ లో చెల్లింపులు చేశాడు. అతడి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.61 లక్షలు కాజేశారు..

ముంబైలోని చండీవాలిలో ఓ వ్యాపారవేత్త తన స్నేహితుని వద్దకు వెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం తాగుదామని డిసైడ్ అయ్యారు. మద్యం ఎలా తెచ్చుకోవాలి. ఆన్ లైన్ లో కాల్ చేసి తెప్పించుకుందామనుకున్నారు. ఇంటర్నెట్ లో మద్యం డోర్ డెలివరీ చేసే వారికోసం వెతికారు. అందులో కనిపించిన ఓ ఫోన్ నెంబర్ కు కాల్ చేశాడు. 

అవతలి వ్యక్తి తాను మద్యం దుకాణంలో పని చేస్తానని, మద్యం హోం డెలివరీ చేస్తామని చెప్పాడు. అయితే దాని కోసం ముందుగా ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించాలని చెప్పాడు. అందుకు ఆ వ్యాపారవేత్త సరే అని రూ.3 వేలు విలువైన మద్య బాటిల్ ఆర్డర్ చేశాడు. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించేందుకు తన అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు వాడాడు. ఆ సమయంలో తన ఫోన్ కు ఓటీపీ వచ్చింది. అవతలి వ్యక్తి ఓటీపీ చెప్పాలని అడగగా..వెంటనే చెప్పేశాడు..వెంటనే అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. రూ.61 వేలు డ్రా అయినట్లు ఉంది. 

దీనిని చూసిన ఆ వ్యాపారవేత్త ఫోన్ లో వ్యక్తిని ప్రశ్నించగా.. ఏదో ప్రాబ్లం వచ్చినట్లు ఉంది. ఆ డబ్బులు మళ్లీ పంపిస్తానని నమ్మించాడు. ఇక మద్యం బాటిల్ కు సంబంధించిన బిల్లు కోసం మరో కార్డు ద్వారా చెల్లించాలన్నాడు. దీంతో ఆ వ్యక్తి మరో కార్డు ద్వారా పే చేయాలని చూశాడు. అయితే అప్పటికే ఆ కార్డు నుంచి రెండు విడతల్లో రూ.లక్ష కొట్టేశారు. అసలు విషయం తెలుసుకున వ్యాపార వేత్త ముంబైలోని పోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment