రెండు నెలలు ఓపికగా ఉండండి : సీరం సంస్థ

కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై రోగుల గురించి పూర్తి డేటా రాకముందే ఎటువంటి నివేదికలు ఇవ్వొద్దని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనవల్లా కోరారు.  ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై మధ్యంతర డేటాపై రిపోరట్ చేయవద్దంటూ ఆయన మీడియాను కోరారు. 

క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ రెండు నెలల్లో ముగుస్తుందని, ఆ తర్వాత డేటా మొత్తం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం రెండు నెలలు ఓపికగా ఉండాలని కోరారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి సీరం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే..ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ను కూడా ప్రారంభించింది. 

Leave a Comment