కాంగ్రెస్ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే : ఆజాద్

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగకపోతే మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తేచ్చిచెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మార్పు జరగాల్సిందేనని తెలిపారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన కమిటీలే లేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక జరగాలని స్పష్టం చేశారు. దేశ ఎన్నికలలో మళ్లీ గెలవాలంటే పార్టీని బలోపేతం చేయాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.. వారిలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. 

Leave a Comment