చాలా మంది తమ మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టి, దిండు కింద పెట్టేసి నిద్రపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంది. తాజాగా దిండుకింద పెట్టిన ఫోన్ పెలి వ్యక్తికి గాయాలైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ వ్యక్తి తన నోకియా ఫీచఱ్ ఫోన్ ను రాత్రి పూట పడుకునే ముందు దిండు కింద పెట్టుకున్నాడు.
ఆ ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆ వ్యక్తి భుజం, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఒక్కసారిగా శబ్దం రావడంతో మేల్కోన్నానని,భుజం వద్ద నొప్పిగా అనిపించిందని బాధితుడు తెలిపాడు. చూస్తే దిండు కాలిపోతుందని, ఫోన్ నుంచి నిప్పులు వస్తున్నాయని పేర్కొన్నాడు.వెంటనే ఫోన్ ను నెట్టేసి ఆస్పత్రికి వెళ్లాలని చెప్పాడు. తాను ఫోన్ కు ఛార్జింగ్ పెట్టలేదని, అయినా పేలిందని బాధితుడు చెబుతున్నాడు.