మూడేళ్లుగా పచ్చి మాంసమే తింటున్నాడు..!

ఈరోజుల్లో ప్రతిఒక్కరూ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం రకరకాల డైట్లను ఫాలో అవుతున్నారు. అలా ఓ వ్యక్తి ఫాలో అయ్యే డైట్ మాత్రం అందర్నీ షాక్ కి గురిచేస్తోంది.. అతడు తీసుకునే డైట్ అందరికంటే భిన్నమైంది. ఇంతకు ఏమనుకుంటున్నారా.. అదే పచ్చి మాంసం డైట్.. అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన వెస్టన్ రోవ్ అనే వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా పచ్చి మాంసం తింటున్నాడు..

మాంసం, చికెన్, గుడ్లు వంటి మాంస ఉత్పత్తులను వండకుండా.. వేడిచేయకుండా పచ్చిగానే తినేస్తున్నాడు.. అంతేకాదు తన ఆహార అలవాట్లపై ఓ డాక్యుమెంట్ కూడా చేశాడు. అతడు పచ్చి మాంసాన్ని తినడం మనం ‘ది నేచురల్ హ్యూమన్ డైట్’ అనే యూట్యూబ్ ఛానెలో చూడవచ్చు. ఇందులో వెస్టన్ సాల్మన్, టర్కీ, చికెన్ మాంసం, పచ్చి మాంసం తినడం చూడొచ్చు. పచ్చి మాంసం తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా అనిపిస్తుందని వెస్టన్ చెబుతున్నాడు. 

ఇటీవల ఓ మీడియాతో వెస్టన్ మాట్లాడాడు. పచ్చి మాంసం తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నానని, ఒక్కసారి కూడా అనారోగ్యానికి గురికాలేదని చెప్పాడు. ఉడికించిన ఆహారంతో పోలిస్తే పచ్చి మాంసంతో మరింత శక్తి వస్తుందని తెలిపాడు. పచ్చి చికెన్ తింటే సాల్మొనెల్లా అనే ఇన్ఫెక్షన్ వస్తుందని, కలుషిత ఆహారం, నీళ్ల కారణంగా ఇది సోకుంతుందని, మీకు ఎప్పుడైన ఈ వ్యాధి వచ్చిందా? అని ప్రశ్నించగా.. ఇది వివాదాస్పదమైన అంశం అని సమాధానం ఇచ్చాడు. పచ్చి మాంసంలోని బ్యాక్టీరియా మన శరీరంలో సహజ సమతుల్యతకు దారి తీస్తుందని చెప్పాడు. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వెస్టన్ రోవ్ చెప్పుకొచ్చాడు.   

  

Leave a Comment