పరీక్షలో కాపీయింగ్ కోసం చెవిలో మైక్రోచిప్.. కాలికి బ్లూటూత్.. వీడియో వైరల్..!

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలకు ఎంతో జాగ్రత్తగా చేపడతారు. అభ్యర్థులను అన్ని రకాలుగా చెక్ చేస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని లోపలికి అనుమతివ్వరు. దీంతో కాపీ కొట్టేందుకు ఛాన్స్ ఉండదు. అయితే కొందరు అభ్యర్థులు మాత్రం పరీక్షలో కాపీ కొట్టేందుకు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ లో కొందరు అభ్యర్థులు బ్లూటూత్ అమర్చిన చెప్పులు ధరించి హైటెక్ కాపీయింగ్ కి పాల్పడిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన మరువకముందే మహారాష్ట్రలో మరో మాస్టర్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. మైక్రోచిప్ బ్లూటూత్ పరికరంతో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు.  

ఔరంగాబాద్ లోని వైజాపూర్ ప్రాంతానికి చెందిన ప్రతాప్ సింగ్ బలోధ్ అనే యువకుడు జల్గావ్ లోని వివేకానంద ప్రతిష్టాన్ స్కూల్ సెంటర్ లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షకు హాజరయ్యేముందు ప్రతాప్ రెండు సార్లు టాయిలెట్ కి వెళ్లి వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిని క్షుణ్ణంగా పరీశిలించారు. అతడి చెవిలో మైక్రోచిప్ ను కనుగొన్నారు. కాల్ రిసీవ్ చేసుకునే విధంగా కాలికి బ్లూటూత్ పరికరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా మైక్రోచిప్ అమర్చిన వ్యక్తిని అక్టోబర్ 9న అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Comment