కోహ్లీ కూతురిని రేప్ చేస్తామంటూ బెదిరించిన.. హైదరాబాదీ అరెస్ట్..!

టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా ఓటమి చెందిన సంగతి తెలిసిందే.. ఆ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్తువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా పేసర్ షమీని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేశారు. షమీని అసభ్యకరంగా మాట్లాడారు. ఈనేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షమీకి మద్దతుగా నిలిచాడు. 

ఈక్రమంలో కోహ్లీపై కొందరు అసభ్యకరమైన కామెంట్లు చేశారు. కోహ్లీ కూతురు వామికాను అత్యచారం చేస్తామంటూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా కోహ్లీ కూతురును అత్యాచారం పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ వారిలో హైదరాబాద్ కు చెందిన 23 ఏళ్ల రామ్ నగేష్ ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. బుధవారం ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నగేష్ ను అరెస్ట్ చేశారు. నగేష్ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పాక్ తో మ్యాచ్ ఓడిన తర్వాత నగేష్ సోషల్ మీడియాలో కోహ్లీ కూతురు గురించి అసభ్యకర మెసేజ్ చేసినట్లు తేలింది.

Leave a Comment