ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకోండి..

ఇప్పుడు ఎక్కడా చూసినా ఒకటే, ఎక్కడ విన్నా ఒకటే చర్చ కరోనా..కరోనా..కరోనా.. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ 168 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నివారణకు ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగతోంది. ఈ మహమ్మారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది చేతులు పరిశుభ్రంగా ఉంచడం. అయితే చేతులు పరిశుభ్రంగా కడుక్కునేందుకు సబ్బులు, హ్యాండ్ వాష్ల కన్నా శానిటైజర్ లను వాడటం మంచిదని ప్రచారం ఉంది. అందువల్ల ఈ శానిటైజర్లకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి తోడు మార్కెట్ లో నకిలీ శానిటైజర్లు తయారు చేసి సొమ్ము చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లోనే శానిటైజర్ లు తయారు చేసుకోవడం ఉత్తమం. అయితే దీనిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

శానిటైజర్ తయారీకి కావాల్సిన వస్తువులు..

రబ్బింగ్ ఆల్కహాల్ –

ఇది నాన్ సెప్టిక్ ద్రావకం. దీన్ని ఐసోప్రోప్టీ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, ఇథనాల్ అని కూడా పిలుస్తారు. ఇది ఫంగస్, వైరస్ లను చంపేస్తోంది. మెడికల్ షాప్స్, మెడికల్ ఏజెన్సీలు లేదా మెడికల్ రసాయనాలు అమ్మే షాపులలో ఇది దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ స్టోర్లలో కూడా బ్రాండ్ ను బట్టి 100 ఎంఎల్ రూ.100 నుంచి రెండు లీటర్లు, 5 లీటర్ల క్వాంటిటీలో రూ.495 లకు దొరుకుతుంది. 

అలోవెరా జెల్ –

కిరాణా, ఆయుర్వేద షాపుల్లో ఇది సులభంగా దొరుకుగుంది. ఇంటిలో అలోవెరా మొక్క ఉంటే దాని నుంచి కూడా సేకరించవచ్చు. ఇది యాంటీ బయోటిక్ గా, చర్మ సంరక్షణకు ఇది ఉపయోగపడుతుంది. 

ఎసెన్సియల్ ఆయిల్ –

అదనపు క్రిమినాశక లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. వివిధ రకాల ఫ్లేవర్లలో ఇది తక్కువ ధరకే దొరుకుతుంది. ప్లాంట్స్ నుంచి సేకరించే ఎసెన్షియల్ ఆయిల్ కాస్మొటిక్స్, పర్ ఫ్యూమ్స్, పలురకాల ఫుడ్ ప్రొడెక్ట్ ల్లోనూ దీనిని ఉపయోగిస్తారు. 

తయారు చేసే విధానం..

100 శాతం ఆల్కహాల్ ద్రావకం ఉంటే 140 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవాలి. దీనిలో 60 ఎంఎల్ మినరల్ వాటర్ మిక్స్ చేయాలి. ఇందులో 100 ఎంఎల్ అలొవెరా జెల్ వేసి 8 నుంచి 15 చుక్కలు వేసి మిక్స్ చేయాలి. అంతా పూర్తిగా మిక్స్ అయితే తర్వాత 300 ఎంఎల్ శానిటైజర్ ను హ్యాండ్ పంప్ బాటిల్ లో వేసుకుని శానిటైజర్ గా వాడుకోవచ్చు. 100 శాతం మిక్స్ ఉన్న ఆల్కహాల్ ద్రావకంలో 30 నుంచి 40 వరకు మినరల్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. రబ్బింగ్ ఆల్కహాల్ దొరక్కపోతే ఓడ్కా లిక్కర్ ను ఉపయోగించుకోవచ్చు. 

Leave a Comment