చిన్నారుల కోసం  మహేష్ మరో ముందడుగు..‘ప్యూర్ హార్ట్ ఫౌంషన్’ ప్రారంభం..!

హీరో మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ సూపర్ స్టారే.. ఆర్థికంగా స్థోమత లేని చిన్నారులకు తన సొంత ఖర్చులతో హార్ట్ సర్జరీలు చేయిస్తున్నారు. తాజాగా హయన మరో ముందడుగు వేశారు. ఇప్పటికే చిన్నారుల హార్ట్ సర్జరీల కోసం రెయిన్ బో, ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి పనిచేస్తున్న ఆయన ఫౌండేషన్ తాజాగా రెయిన్ బో హాస్పిటల్ సారథ్యంలోని ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆస్పత్రిలో ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ని ప్రారంభించారు.

 

మహేష్ బాబు ఇప్పటికే వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్యూర్ లిటిల్ హార్ట్స్ తో కలిసి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని చిన్నారుల్లో పుట్టుకతో గుండెలో వచ్చే అన్ని రకాల లోపాలకు చికిత్స అందించనున్నట్లు మహేష్ బాబు పేర్కొన్నారు. లిటిల్ హార్ట్స్ ఫౌండేష్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తర్వాత రెయిన్ బో ఆస్పత్రిలో హార్ట్ సర్జరీలు చేయించుకొని పూర్తిగా కోలుకున్న చిన్నారులను పలకరించి చిరు కానుకలు అందజేశారు.  

 

 

Leave a Comment