బంగారు చేపలు.. కోటీశ్వరుడైన మత్స్యకారుడు..!

ఓ మత్స్యకారుడి పంట పండింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు. ఆ మత్స్యకారుడి వలలో అరుదైన చేపలు పడ్డాయి. దీంతో ఆ చేపలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వేరే రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఆ చేపలను భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

పాల్ ఘర్ కు చెందిన చంద్రకాంత్ థారె అనే మత్స్యకారుడు ఆగస్టు 28న సముద్ర తీర ప్రాంతం వద్వాన్ కు హర్బా దేవీ బోటులో తన బృందంతో కలిసి వేటకు వెళ్లాడు. వారికి వలలో భారీగా చేపలు పడ్డాయి. ఆ చేపల్లో సముద్ర బంగారంగా పిలిచే అత్యంత అరుదైన ‘గోల్ ఫిష్’ భారీగా పడ్డాయి. 157 చేపలు పడడంతో వాటిని తీసుకుని మార్కెట్ కు వెళ్లగా వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 

యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు ఆ చేపలను ఏకంగా 1.33 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఒక్కో చేప విలువ రూ.85 వేలు పలికింది. అయితే ఆ చేపలను అంత ధరకు కొనుగోలు చేయడానికి కారణం ఉంది. ఈ చేపకు హంకాంగ్, మలేసియా, థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్, జపాన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ అరుదైన చేపను వైద్య పరిశోధనల్లో ఉపయోగిస్తారు. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

Leave a Comment