బాలయ్యతో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్న బోయపాటి..!

బోయపాటి శీను సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఆయన సినిమాలో యాక్షన్ సీన్లు పీక్స్ లో ఉంటాయి. హై వోల్టేజ్ కమర్షియల్ అంశాలతో ఆడియన్స్ ను థ్రిల్ చేస్తారు. ఇలాంటి మాస్ డైరెర్టర్ మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా వస్తే అది సంచలనమే.. గతంలోనే సింహా, లెజెండ్ లాంటి సినిమాలతో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. ‘అఖండ’తో ఇదే కాంబినేషన్ రిపీల్ కానుంది. 

ఈనేపథ్యంలో తాజాగా ‘అఖండ’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణను సింహా, లెజెండ్ సినిమాల్లో కంటే పవర్ ఫుల్ గా చూపించనున్నారట.. ఈ సినిమాలో మొత్తం 8 ఫైట్ సీన్స్ ఉంటాయని, అవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫైట్స్ సినిమాకే హైలెట్ కానున్నాయట..

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు గెటప్పుల్లో కనిపించనున్నారు తెలిసింది. అఘోరాగానూ, కలెక్టర్ గానూ రెండు బలమైన పాత్రల్లో బాలయ్య కనిస్తారని సమాచారం. బాలయ్య పాత్రలు ఈ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. కాగా ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది..

 

Leave a Comment