సామాన్యుడిపై గుదిబండ.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..!

సామాన్యుడి నెత్తిపై మళ్లీ భారం పడింది. అసలే కరోనా కష్టకాంలో గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగియి. సబ్సిడీ సిలిండర్ పై రూ.25, సబ్సిడియేతర సిలిండర్ పై రూ.75 రూపాయలు పెరిగాయి. పెరిగిన ఈ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. 

కాగా 15 రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ.884.50కి, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల సిలిండర్ ధర రూ.1,693కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలర్ తో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. మొత్తంగా ఈ ఏడాది 14.2 కేజీ గ్యాస్ సిలిండర్ పై రూ.165.50 వరకు ధర పెరిగింది. ఈ ఏడాది ఆరంభంలో సిలిండర్ ధర రూ.694గా ఉంది. 

 

Leave a Comment