చీర కట్టుకోవడం రాదని భర్త ఆత్మహత్య..!

ప్రస్తుతం మారుతున్న జీవన పరిస్థితుల్లో మనిషి మనోధైర్యాన్ని కోల్పోతున్నాడు. చిన్న చిన్న విషయాలకే తట్టుకోలేకపోతున్నాడు. చివరికి ఆత్మహత్య శరణ్యంగా భావిస్తున్నాడు.. ఏదో పెద్ద కారణం ఉంటేనే కొందరు ఆత్మహత్యలకు పాల్పడతారు. కానీ మరీ అర్థంపర్థం లేని చన్ని చిన్న కష్టాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇలానే ప్రవర్తిస్తున్నారు. 

తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణం వింటే మరీ సిల్లీగా, కామెడిగా అనిపిస్తుంది. భార్యకు చీర కట్టుకోవడం రాదని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఔరంగాబాద్ లో ఓ వ్యక్తి(24)కి ఆరు నెలల క్రితం పెళ్లయింది. పెళ్లి చేసుకున్న అమ్మాయి అతడి కంటే ఆరేళ్లు పెద్దది. కానీ ఆమెకు చీర కట్టుకోవడం, మాట్లాడటం, నడవటం సరిగా రాదు. 

దీంతో ఆ భర్త అసంతృప్తిగా ఉండేది. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా సూసైడ్ నోట్ లో తన భార్యకు చీర కట్టుకోవడం రాదనే చనిపోతున్నాని పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరిష్కరించుకోవాల్సిన చిన్న సమస్యే అది.. కానీ క్షణికావేశంలో తన ప్రాణాలనే బలితీసుకున్నాడు. చిన్న సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అని భావిస్తున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటో కామెంట్ చేయండి..   

Leave a Comment