బైక్ టైర్ లో చున్నీ చుట్టుకుని విద్యార్థిని మృతి..!

బైక్ పై ప్రయాణించే సమయంలో ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం.. ఒక్కోసారి మనం వేసుకున్న దుస్తులే ప్రాణాలు పోయేందుకు కారణం కావచ్చు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. అనుకోని విధంగా ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బైక్ వెనుక టైర్ లో చున్నీ చుట్టుకోవడంతో విద్యార్థిని కిందపడి మరణించింది. 

వివరాల మేరకు యాచారం మండల కేంద్రానికి చెందిన సనా(18) ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆదివారం సాయంత్రం తన సోదురుడి బైక్ పై కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మార్గమధ్యంలోని ఆమె చున్నీ బైక్ వెనుక టైర్ లో చుట్టుకుంది.

దీంతో సనా బైక్ పై నుంచి కింద పడిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సనా సోమవారం తెల్లవారుజామున చనిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసకున్నారు.. బైక్ పై పిల్లలను, ఆడవాళ్లను తీసుకెళ్లే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్లు చీర కొంగు లేదా చున్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మృత్యువు ఏ విధంగా వస్తుందో చెప్పలేం..    

 

 

 

Leave a Comment