రైల్వే ట్రాక్ పై బాలిక.. రైలుకు ఎదురెళ్లి మరీ అమ్మాయిని కాపాడాడు..!

రైల్వే ట్రాక్ పై బాలిక.. రైలుకు ఎదురెళ్లి మరీ అమ్మాయిని కాపాడాడు..ఎవరైనా ఇబ్బందుల్లో లేదా ప్రమాదంలో ఉంటే వారికి సాధ్యమైనంత వరకు సాయం చేయగలరు. కానీ ప్రాణాలకు తెగించి సాయం చేయాలంటే మాత్రం వెనుకడుగు వేస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన ప్రాణాలకు తెగించి రైల్వే పట్టాలపై పడిన ఓ బాలికను కాపాడాడు. దీంతో ఆ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని బర్ఖేడి ప్రాంతంలో మహ్మద్ మెహబూబ్ అనే వ్యక్తి కార్పెంటర్ పనిచేస్తుంటాడు. మెహబూబ్ ఓ రోజు తన పని ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి ఫ్రెండ్స్ తో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. వెనుక వైపు నుంచి గూడ్స్ రైలు రావడంతో కొద్ది సేపు ఆగారు. 

అదే సమయంలో ఓ బాలిక రైల్వే ట్రాక్ పై పడిపోయింది. అయివే రైలు వేగంగా వస్తోంది.. ఆ బాలికను కాపాడేందుకు సమయం కూడా లేదు. దీంతో అక్కడున్న వారంతా అరవం మొదలుపెట్టారు. పరిస్థితిని గమనించిన మెహబూబ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ట్రాక్ వైపు వెళ్లాడు.రైల్వే ట్రాక్ పై పడి ఉన్న బాలిక చేతిని పట్టుకుని ట్రాక్ మధ్యలో కదలకుండా పడుకున్నారు.

 అంతేకాదు ఆమె తల పైకెత్తకుండా చేయి పెట్టి కిందకి ఉంచేలా పట్టుకున్నాడు. ఆ గూడ్స్ రైలు వేగంగా వారి మీద నుంచి వెళ్లిపోయింది. రైలు వెళ్లిపోయిన తర్వాత వారిద్దరూ క్షేమంగా అక్కడి నుంచి బయటపడ్డారు. ఎవరో తెలియని అమ్మాయి కోసం మెహబూబ్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పట్టాల మీదకు దూకాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు మెహబూబ్ సాహసంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం మెహబూబ్ పై ప్రశంసలు కురిపించారు.      

Leave a Comment