వామ్మో.. ప్రపంచంలోనే పొడవైన కాళ్లు..గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు..

అమెరికాలోని టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల యువతి మాకి కురియన్.. ప్రపంచంలోనే పొడవైన కాళ్లతో రికార్డు బద్దలు కొట్టింది. ఈమె ఎత్తు 6 అడుగుల 10 అంగుళాలు. అందులో ఆమె కాళ్ల పొడువు 4 అడుగుల 5 అంగుళాలు ఉంటుంది. పొడవైన కాళ్లు కలిగిన యువతిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదు చేసింది. 

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ నగరంలో తన తల్లి త్రిష్ తో కలిసి ఉంటుంది. కురియన్ మోడలింగ్ లో కేరీర్ ప్రారంభిచాలని భావిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తయిన మోడల్ గా రికార్డు సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.  అయితే కురియన్ కు మాత్రం తన సైజుకు తగ్గట్లు బట్టలు, చెప్పులు, బూట్లు దొరకవు. అన్ని ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. 

ఆమె తల్లి 5 అడుగుల 7 అంగుళాలు, తండ్రి కామెరాన్ ఆరు అడుగులు ఉండటంతోనే అంత పొడువుకు కారణం కావచ్చని ఆమె చెబుతుంది. అయితే ప్రపంచంలోనే ఎత్తయిన సజీవ మహిళగా రికార్డు కొట్టాలంటే ఆమెకు ఇంకా సమయం ఉంది. ఎందుకంటే చైనాకు చెందిన 33 ఏళ్ల సన్ ఫాంగ్ 7.3 అడుగులతో ప్రపంచ పొడవైన మహిళగా రికార్డు అందుకున్నారు. 

 

Leave a Comment